ఇలా అయినా హీరో నానికి హిట్ దక్కేనా..!!

-

నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో. తాను చేసిన ప్రతి సినిమా హిట్ లేదా ఏవరేజ్ గా ఆడేవి. ప్రస్తుతం తన పరిస్థితి అస్సలు బాగోలేదు. తన గత సినిమా అంటే సుందరానికి థియేటర్స్ లో విడుదల అయ్యి ప్లాప్ అయ్యింది. అదే సినిమా టీవి ఛానల్ లో దారుణమైన రేటింగ్ వచ్చింది. ఎప్పుడో తీసిన తన పాత సినిమా వేసినా దానికంటే ఎక్కువ రేటింగ్ వచ్చేది.

ఇలా థియేటర్ లో ప్లాప్ కావడం, టీవీ రేటింగ్స్ చెప్పుకోలేని విధంగా రావడం చూసి చాలా బాధ పడ్డాడట. సినిమా కోసం ఎంత కష్ట పడ్డా ఇలాంటి ఫలితాన్ని జీర్ణించుకోలేక పోయాడట. ఇక మళ్లీ కచ్చితంగా హిట్ కొట్టాలని పుష్ప టైప్ లో మాస్ గా దసరా అనే సినిమా లో నటిస్తున్నాడు. అలాగే నిర్మాత గా మారి అడివి శేష్ తో `హిట్ 2`సినిమా తీశాడు..

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీపై  నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. `హిట్ : ది ఫస్ట్ కేస్` హిట్ అనిపించుకోవడంతో `హిట్ 2` పై  సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాడు. అలా అయినా తన ప్లాప్ మర్చి పోయి హిట్ మైకంలో తేలి పోవాలని అనుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news