బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో మొదట సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం, నిర్మాత గా కూడా వ్యవహరించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నది. ఇక తర్వాత నటించిన ఎన్నో సినిమాలు సుధీర్ కు పెద్దగా కలిసి రాలేదు. మళ్లీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తో గాలోడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో బాగా దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో సుధీర్ సరసన గెహనా సిప్పీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ రొటీన్ కథ అయినప్పటికీ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ సుధీర్ క్యారెక్టర్ ను బాగా చూపించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గాలోడు మూవీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొని.. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలు చేకూరుస్తోందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా సుధీర్ తన కెరీర్లు మొదటిసారి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందుకున్నారని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ప్రముఖ ఓటీటి సంస్థ భారీ డీల్ కుదురుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమాని రూ.5 కోట్ల రూపాయలకు శాటిలైట్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా విడుదల తేదీ పై ఇంకా అధికారికంగా ప్రకటన వెలుపడలేదు. మరి రాబోయే రోజుల్లో అప్డేట్ వస్తుందేమో చూడాలి.