రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తోంది.. భీమ్స్ సంగీతం అందించిన ధమాకా మూవీ ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది.సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు.
మీడియం బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే రూ.18.30 కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఏరియా వైజ్ గా వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం : రూ.5.5 కోట్లు, సీడెడ్ : 2.5 కోట్లు, ఆంధ్ర : 8 కోట్లు, తెలంగాణ – ఏపీ టోటల్ : రూ.16 కోట్లుకర్ణాటక, ఓవర్సీస్, ఇండియాలోని మిగితా ఏరియాల్లో రూ.2.30 కోట్లు.
మొత్తంగా ‘ధమాకా’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19.00 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరో రవితేజ ఈ హిట్ చాలా అవసరం. అందుకే అనేక ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ మూవీ కు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా పాజిటివ్ టాక్ వస్తే చాలు క్రిస్మస్ సెలవుల్లో రవితేజ వసూళ్ళు దున్నుకోవడం ఖాయం.