కాంగ్రెస్‌కు ఊరట..సెట్ చేస్తున్న దిగ్విజయ్.!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న విషయం తెల్సిందే… ఓ వైపు వ్యూహకర్త సునీల్ ఆఫీసులపై పోలీసుల దాడులు జరగడం..అక్కడ కాంగ్రెస్ సీనియర్లని టార్గెట్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారని అంశాలు బయటపడటం కల్లోలం రేపాయి. మరోవైపు టి‌పి‌సి‌సి పదవులల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందని, టీడీపీ నుంచి వచ్చిన వారికే సగం పదవులు ఇచ్చారని సీనియర్లు ఆరోపణలు చేయడం.. ఆ వెంటనే టీడీపీ నుంచి పదవులు పొందిన 13 మంది రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో పోరు పీక్స్‌కు వెళ్లింది. దీంతో అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌ని రాష్ట్రానికి పంపారు.

ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో జీ-9 కాంగ్రెస్ నేతల ఆరోపణలపై దిగ్విజయ్ చర్చించనున్నారు. ఒక్కొక్క నేతతో ఆయన వేర్వేరుగా మాట్లాడనున్నారు. అభ్యంతరం తెలిపిన అసమ్మతి నాయకులతో విడివిడిగా మాట్లాడి.. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోనున్నారు. తర్వాత పీఏసీ సభ్యుల కమిటీ తో చర్చలు జరపనున్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. మిగిలిన సభ్యులతో దిగ్విజయ్ సమావేశమై చర్చలు జరపనున్నారు. అటు జగ్గారెడ్డి…దిగ్విజయ్‌ని పర్సనల్ గా కలిశారు. అయితే దిగ్విజయ్ పార్టీలోని సమస్యలని పరిష్కరిస్తారని నేతలు ఆశితున్నారు.

ఇదిలా ఉంటే హైకోర్టులో  కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. వార్ రూమ్ ఘటన లో పోలీసుల 41 సీఆర్పీసీలపై ధర్మసనం స్టే విధించింది. అయితే నోటీసులు కొట్టివేయలని కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ… పోలీసులు జారీ చేసిన 41 సీఆర్పీసీపై స్టే విధించింది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త లైన్ లో పడుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంతటితో కాంగ్రెస్ లో వివాదాలు సద్దుమణుగుతాయెమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news