త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెడతా – హీరో విశాల ప్రకటన

-

తమిళ్‌ హీరో విశాల్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళ్ చిత్ర పరిశ్రమ మరియు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ కు మంచి క్రేజ్ ఉంది. హిట్ ఫ్లాఫ్ ల తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్…తాజాగా సంచలన ప్రకటన చేశాడు.

తాను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని ప్రముఖ నటుడు విశాల్ స్పష్టం చేశారు. అయితే ఏపీలో ప్రచారం జరుగుతున్నట్లు కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. చెన్నైలో ‘లత్తి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విశాల్ ఈ వాక్యాలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news