కాంగ్రెస్ పార్టీకి వరస షాక్ లు… బీజేపీలో చేరనున్న మరో ముఖ్య నేత

-

కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీని విడిచివెళుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పార్టీ కి భారీ షాక్ లు తప్పడం లేదు. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ లీడర్ ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరారు. యూపీలో కీలక నేతగా ఉన్న ఈయన కాంగ్రెస్ పార్టీని వీడటం భారీ లోటుగా రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికలు జరుగనున్న మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా కీలక రాజకీయ పరిణామం ఏర్పడింది. ఆ రాష్ట్ర మాజీ కాంగ్రెస్ ఛీఫ్ కిషోర్‌ ఉపాధ్యాయ నేడు బీజేపీలో చేరనున్నారు. రాష్ట్ర ఛీఫ్ గా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడటం భారీ దెబ్బగానే చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఆయన తెహ్రీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కిషోర్ ఉపాధ్యాయను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని..6 సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించారు. క్రమశిక్షణా చర్యగా ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news