ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దారుణం… అది కోసేసిన యువతి కుటుంబ సభ్యులు…

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తమ ఇంటి యువతినే పెళ్లాడని… యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నారు. దారుణంగా కొట్టి మర్మాంగాలు కొసేశారు. నిజ జీవితంలో ’ఉప్పెన‘ మూవీ క్లైమాక్స్ ను తలపించేలా వ్యవహరించారు యువతి కుటుంబ సభ్యులు. ఉప్పెన సినిమాలో తన కూతురుని ప్రేమిస్తున్నాడని హీరో మర్మాంగాలు కోయిస్తాడు హీరోయిన్ తండ్రి. అచ్చం ఇలాంటి సంఘటనే ఢిల్లీ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే… ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేాదు. యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరిద్దరు ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు యువకుడిపై కక్ష పెంచుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కోసం రాజౌరీ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అయితే ఈవిషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు యువకుడు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజౌరీ గార్డెన్ ఏరియా లో అతడిని కిడ్నాప్ చేసి .. దారుణంగా కొట్టి.. మర్మాంగాన్ని కోసేశారు. అయితే ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సప్థార్జంగ్ ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు.

.