Purna : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

-

టాలీవుడ్​ హీరోయిన్​ షామ్నా కాసిమ్.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పూర్ణ అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఈ బ్యూటీ సోమవారం రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంది. దుబాయ్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. బెడ్​పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో తీసుకున్న ఫొటోను ఆమె తన ఇన్​స్ట్రాలో షేర్​ చేసింది.

గతేడాది అక్టోబర్​లో దుబాయ్​కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ. ఆ తర్వతా కొద్ది రోజులకే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇటీవలే తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఆ ఫొటోలతో బేబీ బంప్​లో పలు ఫొటోలను షేర్​ చేసింది. పూర్ణ ఈ శుభవార్త చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా శుభాకంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news