శ్రేయాస్ అయ్యర్” గత ఏడాది ఐపియల్ లో ఢిల్లీ టీంకి కెప్టెన్ ఇతను. పాతికేళ్ళు కూడా రాకుండా కెప్టెన్ ని ఏ విధంగా చేస్తారని చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటిది ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాడిని కెప్టెన్ ని ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు చాలా మంది. అయితే అతని గురించి తెలిసిన వారు మాత్రం పెద్దగా ఆలోచించలేదు.
ఇప్పుడు టీం ఇండియాలో అతను చాలా కీలకం అయ్యాడు. నాలుగో స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లను కెప్టెన్ కోహ్లీ పరీక్షించాడు. కాని ఆ స్థానంలో అయ్యర్ స్థాయిలో ఆడిన ఆటగాడు ఎవరూ లేరు అనేది వాస్తవం. అయితే అతనికి అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అతని మానసిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుందని ద్రావిడ్ ఒకానొక సందర్భంలో చెప్పారు.
ఏ పరిస్థితిలో అయినా సరే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా అతని సొంతం అని ఇప్పటికే రుజువు అయింది. నాలుగో స్థానంలో అతను చెలరేగిపోతున్నాడు. అందుకే కోహ్లీ కూడా ఆ స్థానంలో మరో ఆటగాడిని తీసుకొచ్చే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదు. అందుకే కివీస్ సీరీస్ కి కూడా అతన్ని ఆ స్థానంలో ఉంచాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు.
కివీస్ తో జరిగిన తొలి టి20 లో చెలరేగిపోయాడు. ఫోర్లు సిక్సులతో చుక్కలు చూపించాడు. దీనితో టీం ఇండియా మంచి విజయం సాధించింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా అతను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఆర్మీలో అతను చాలా కీలకంగా మారిపోయాడు. టి20 ప్రపంచకప్ లో కూడా అతని ఆట చాలా కీలకంగా మారనుంది. ఒకరకంగా చెప్పాలి అంటే మిడిల్ లో అతను టీం ఇండియా తూర్పు ముక్క అయ్యాడు.