జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఏపీ హై కోర్టు. చింతామణి నాటకం నిషేధం పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు లో దాఖలైన పిటిషన్ వాదనలు ఇవాళ న్యాయవాది ఉమేష్ చంద్ర వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ..నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది ధర్మాసనం. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు.. హై కోర్టు కు తెలిపారు.
పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏపీ ధర్మాసనం. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, ఇతర అధికారులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు. కాగా.. గత మూడు వారాల కిందట ఏపీలో చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఏపీ సర్కార్.