నిన్న సాయంత్రం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కూడా రాజకీయం అంతా కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఆయన తరఫు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనికి సంబంధించి నేడు మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ కొట్టేసారు.
సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాలని కూడా రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు కు హైకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి మేము హైకోర్టు వరకు వచ్చామని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు హైకోర్టుకి వివరించారు. ఈ కేసులో ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని అని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే ప్రాథమిక విచారణ గాని ఆధారాలు లేకుండా అదుపులోకి తీసుకున్నారని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.