నూతన పార్లమెంట్ దేశానికి గర్వకారణం – నిర్మలా సీతారామన్

-

ఈనెల 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం ముదురుతోంది. ఈ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడం వివాదానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రారంభిస్తేనే తాము వస్తామని.. లేకపోతే రామని కాంగ్రెస్ సహా 19 పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం ప్రజాస్వామ్యం పై దాడి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బాయికాట్ చేయడం పై స్పందించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దీనిపై ప్రతిపక్షాలు పునరాలోచన చేయాలని కోరారు. పార్లమెంటు ప్రజాస్వామ్య ఆలయమని.. ప్రధాని మోదీ కూడా పార్లమెంటు మెట్లపై తలవంచుతారని అన్నారు. ఈ వేడుకల్లో హాజరయ్యేలా మీ ఆలోచన మార్చుకోవాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. నూతన పార్లమెంటు దేశానికే గర్వకారణం అని చెప్పుకొచ్చారు నిర్మల సీతారామన్.

Read more RELATED
Recommended to you

Latest news