వ్యాపారులకు బిగ్ షాక్.. గడ్డిఅన్నారం మార్కెట్ పై హై కోర్టు సంచలన తీర్పు

గడ్డి అన్నారం మార్కెట్ తరలిం పు పై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తీర్పు తీసుకుంది. మార్కెట్ తరలించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు హై కోర్టు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని పేర్కొంది తెలంగాణ హై కోర్టు. బాట సింగారం వెళ్లేందుకు వ్యాపారులకు నెల గడువు ఇచ్చింది హై కోర్టు.

నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో పూర్తి సదుపాయాలు కల్పించాలని హై కోర్టు పేర్కొంది. ఆదేశాలిచ్చినా వ్యాపారులను మార్కెట్ లోకి అనుమతించకపోవడం పై హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటి ఛైర్మన్, కార్య దర్శి పై అసహనం వ్యక్తం చేసింది. ఛైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పి.హర్షలకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది తెలంగాణ హైకోర్టు. తాము ఇచ్చిన ఆదేశాలను అందరూ పాటించాలని పేర్కొంది తెలంగాణ హై కోర్టు. దీనిపై మరో నిర్ణయం లేదని పేర్కొంది.