నేడు ఆరోగ్యాధికారులతో హరీష్ రావు కీలక సమావేశం… కరోనా పరిస్థితులపై చర్చ

-

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ధడ పుట్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓమిక్రాన్ నేపథ్యంలో అలెర్ట్  అవుతున్నాయి. తాజాగా ఏపీలో ఓమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో పాటు ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలెర్ట్ అవుతోంది.

నేడు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కీలక భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియంట్, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. జనవరి, ఫిబ్రవరిల్లో కేసుల సంఖ్య పెరుగుతుందనే తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తున్న తరుణంలో ఈ భేటీ కీలకం కానుంది. మందులు, టెస్టింగ్ కిట్లు, బెడ్లను అందుబాటులో ఉంచే విషయంపై అధికారులతో హరీష్ రావు చర్చించనున్నారు. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను ముందస్తుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఓమిక్రాన్ నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేసేలా అధికారులను మంత్రి ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news