ఆంధ్రప్రదేశ్ డీజీపీపై ఆ రాష్ట్ర హైకోర్ట్ సీరియస్ అయింది. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ముందు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు పోలీసులు. దీనితో ఈ ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ కుమార్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ నేపధ్యంలోనే డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్ట్ కి రావాలని ఆదేశించింది.
కోర్ట్ ఆదేశించడంతో సవాంగ్ కోర్ట్ కి హాజరయ్యారు. విశాఖలో చంద్రబాబుకు సీఆర్సీసి 151నోటీసులపై హైకోర్టు విచారణ జరిపింది. సీఆర్సీసి 151 సెక్షన్ ఆర్డర్ ని హైకోర్ట్ చదవమని ఆదేశించింది. పోలీసులపై యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని హైకోర్ట్ ప్రశ్నించింది. విశాఖ పోలీసు అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్ట్ నిలదీసింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున చర్యలు తీసుకోలేనని ఆయన చెప్పారు.
కోర్టు ఆదేశిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాని వివరించారు. కాగా ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయినట్టు సమాచారం. చంద్రబాబుకి జెడ్ కేటగిరి భద్రత ఉందని ఇలాంటి చర్యలతో అలాంటి భద్రత ఉన్న ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎవరిపై చర్యలు తీసుకుంటారు అనేది పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.