నిజమాబాద్ : బాసర ట్రీఫుల్ ఐ.టి. ఫుడ్ పాయిజన్ ఘటన పై ఉన్నత స్థాయి విచారణ చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణ ప్రకటన చేశారు. 22 మందిని నిజమాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం 11 మందిని డిశ్చార్జి చేసామని స్పష్టం చేశారు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణ. మరో 11 మంది కొలుకున్నారు.
మరి కాసేపట్లో డిశ్చార్జి చేస్తామన్నారు. హాస్టల్ లో జరిగిన ఘటన పై విచారణ చేసి బాద్యుల పై చర్యలు తీసుకుంటామని.. 16 కోట్ల బాసరకు కేటాయించామని వెల్లడించారు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణ. అటు బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
సెక్షన్ 273,336,ipc59/3 ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ యాక్టు 2006 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్ ఎస్ క్యాటర్స్, కేంద్రీయ బండార్ అనే రెండు మెస్ ల పై కేసు నమోదు చేశారు పోలీసులు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ రంజిత్ కుమార్ పిర్యాదు తో కేసు నమోదు చేసారు బాసర పోలీసులు.