హుజురాబాద్ వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్కల్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు కూడా ఉన్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో రెండు పార్టీల కార్యకర్తలు పరుగులు తీశారు.
అయితే పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల లోపు కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తుండడంతోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీణవంక మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద లీడర్లు అధికారం ప్రదర్శించడానికి చూస్తే కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే కొద్ది సేపటి క్రితమే జిల్లా కలెక్టర్ వీణవంక మండలం లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెళ్లారు.