తెలంగాణలోని జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బీజేపీ నేతల మీద సీఐ మల్లేష్ లాఠీఛార్జి చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టిన బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ఛలో జనగామకు పిలుపునిచ్చారు.
24 గంటల్లో సీఐని సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. ఇక ఆయన కరీంనగర్ నుంచి జనగామకు బయలుదేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున జనగామ మొత్తం మోహరించారు అని తెలుస్తోంది. బండి సంజయ్ సీఎం కేసీఆర్ తో పాటు డిజిపికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. తాను అందరు పోలీసులను తప్పు పట్టడం లేదని కొందరు కావాలని బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.