సీఎంగా కేటీఆర్.. క్లారిటీ ఇచ్చిన కొడుకు !

-

గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎంగా కేసీఆర్ తప్పుకుంటారనని ఆయన స్థానంలో కొడుకు కేటీఆర్ ని సీఎం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎక్కడ మొదలైందో తెలీదు గానీ ఫిబ్రవరి 18 వ తారీఖున కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తేదీలతో సహా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా  ఎమ్మెల్యేలు సహా మంత్రులు కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటూ ప్రశ్నించడంతో దాదాపుగా కేటీఆర్ ని సీఎం చేయడం ఖాయం అయిపోయింది అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ అంశం మీద తాజాగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు స్పందించారు. ఒకరకంగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా ఆపద అంటూ ఆయన వద్దకు వెళితే వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్స్ తో ఆయన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఇందులో ఒక ఫాలోవర్ మీ నాన్న కేటీఆర్ సీఎం అవుతారట నిజమేనా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని తన తండ్రి కేటీఅర్, తాత కేసీఆర్ కలిసినప్పుడు పాలిటిక్స్ మాట్లాడటం కంటే ఎక్కువగా చిల్ అవడనే ప్రాధాన్యత ఇస్తారని వారిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు అసలు పాలిటిక్స్ మాట్లాడరని అని ఆయన చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news