హిందీ ‘హిట్’ ట్రైలర్ రిలీజ్..రాజ్ కుమార్ రావు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో దర్శకుడు శైలేశ్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్’. ఈ ఫిల్మ్ ను హిందీలో సేమ్ డైరెక్టర్ తో రీమేక్ చేశారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చే నెల 15న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు కు జోడీగా సన్యా మల్హోత్ర నటించింది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో రాజ్ కుమార్ రావు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉండగా, అంచనాలను మించి సినిమా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీని గుల్షన్ కుమార్, టీ సిరీస్ ప్రజెంట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో సౌతిండియన్ ఫిల్మ్స్ ను హిందీలో రీమేక్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ఈ క్రమంలోనే ‘హిట్’ ఫిల్మ్ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రాజ్ కుమార్ రావు తన నటనతో ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడని, ఒరిజినల్ కంటే ఇంకా బెటర్ గా నే సినిమా వచ్చేలా ప్లాన్ చేసినట్లు మేకర్స్ వివరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version