హిందూ ధర్మ కర్త కాళీచరణ్ అరెస్టుపై హిందూ నాయకులు, న్యాయవాది కూలభూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ ఓవైసీ అరెస్టు చేయాలని.. ఆయనను అరెస్టు చేస్తే ఏకంగా 22 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు. కాళీచరణ్ అరెస్టు పై గ్రామంలోని పలు వీధుల్లో ఆందోళనలు జరిగాయి.
ఈ నేపథ్యంలో కూలభూషణ్ డిప్యూటీ కమిషనర్ నివాసం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కూల భూషణ్. ” మత పెద్దలను దార్శనికుల ను జరిగిన అవమానాన్ని తాము భరించలేం. ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ హక్కు ఉంటుంది. అసలు వైసీపీ ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు. వైసీపీ పట్టుకున్న పోలీసు అధికారికి 22 లక్షల రివార్డు అందిస్తా ” అంటూ కూల భూషణ్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి. అటు దీని పై ఎంఐఎం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.