ఇస్లామిక్ పరీక్షలో టాప్ గా నిలిచిన హిందూ యువకుడు.

-

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ అధ్యయనాల ఎంట్రన్స్ ఎగ్జామ్ లో హిందూ యువకుడు టాపర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన యువకుడి పేరు శుభమ్ యాదవ్. జైపూర్ లోని అల్వార్ కి చెందిన శుభమ్ యాదవ్, ఇస్లామిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. తత్వశాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన శుభమ్ యాదవ్ కి ఇస్లాం మతంపై అవగాహన పెంచుకునేందుకు లోతైన పరిశోధన చేసాడు.

ఇస్లాం గురించి బయట చాలా అపోహాలున్నాయని, చాలామంది ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, అందుకే ఇస్లాం గురించి చదవాలనుకున్నాని, అలాగే యుపీఎస్సీ పరిక్షలకి సిద్ధమవబోయే నాలు ఇది చాలా పనికివస్తుందని తెలిపాడు. ఇస్లాం గురించి చదవాలనుకున్న ఐడియాని తన తండ్రి సపోర్ట్ చేసాడని, వాళ్ళు సపోర్ట్ చేసారు గనకే ఇప్పుడు టాపర్ గా నిలిచానని అన్నారు. మరికొద్ది రోజుల్లో కాశ్మీర్ లో ఇస్లాం గురించి చదవబోతున్నానని రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉంటానని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news