ఆషాడమాసంలో అత్తా కోడళ్ళు అందుకే ఒకే చోట ఉండకూడదా?

-

ఆషాడమాసం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు..కొత్తగా పెళ్ళయిన జంట ఒకే చోట ఉండకూడదు.అలాగే అత్తా కోడళ్ళు కూడా ఒకే గడపలో తిరగొద్దు అని తెలుసు..కానీ ఈ మాసానికి చాలా చరిత్ర ఉందని పండితులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..

దీనికి మరో పేరు శూన్యమాసం.శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెబుతోంది. అదే ఆషాడ మాసంలో అత్త కోడలు కూడా ఒకే గడపలో అంటే ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం. అసలు ఈ సాంప్రదాయానికి ఒక కారణం ఉందట.. వైశాఖమాసం అంటే చెప్పనవసరం లేదు. మండే వేసవికి అనుకూలమైన మాసం. ఈ మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్లికూతురుకు అసౌకర్యంగా భావన కలగడంతో అత్తా కోడల మధ్య సఖ్యత లేకుండా పోతుందట. అందువల్లే ఆషాడ మాసంలో పుట్టింటికి పంపిస్తారని చెబుతుంటారు. పెద్దవాళ్ళు. ఇదే ఆషాడ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకపోవడానికి కారణం అని కొంతమంది చెబుతుంటారు…

ఇక మరి కొంత మంది మాత్రం ఆషాడ మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం. రైతు కష్టపడితే గాని దేశానికి తిండి దొరకదు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతారు. కాబట్టి భార్య ను పుట్టింటికి పంపిస్తారని అంటున్నారు. ఆషాడ మాసంలో భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల వారికి పుట్టబోయే బిడ్డకు మంచి గుణగణాలు రావు అనే ఆచారం ప్రకారం కూడా భార్యను పుట్టింటికి ఆ సమయంలో పంపుతారని చెబుతుంటారు. ఆషాడం లో మాసంలో కోడలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మండే వేసవికాలంలో పుడతాడని అలా పుట్టడం వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని పుట్టింటికి పంపిస్తారు..ఇది ఆషాడమాసం చరిత్ర..

Read more RELATED
Recommended to you

Latest news