టీడీపీలో ‘రాబిన్’ రాజకీయం…పీకేని మించి?

-

గతంలో రాజకీయాల్లో వ్యూహకర్తల పేర్లు ఎక్కువ వినిపించేవి కాదు..ప్రతి పార్టీలోనూ అధినేతే వ్యూహకర్తగా ఉండేవారు..వారే పార్టీ గెలుపు కోసం పనిచేసేవారు…ప్రత్యర్ధులని చిత్తు చేసే వ్యూహాలు రచించేవాళ్లు. అయితే ఇదంతా ఒకప్పుడు..కానీ ఇప్పుడు సీన్ మారింది…ప్రతి పార్టీకి ఓ వ్యూహకర్త కావాల్సి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదట వ్యూహకర్తని వైసీపీ నియమించుకుంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్…ప్రశాంత్ కిషోర్ ని తమ పార్టీ వ్యూహకర్తగా నియమించారు.

ప్రశాంత్ వ్యూహాలతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది..ఇప్పటికీ పీకే టీం జగన్ కోసం పనిచేస్తుంది. ఇక రాజకీయ అపరచాణక్యుడుగా పేరొందిన చంద్రబాబు సైతం 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక ఆయన వ్యూహకర్తని పెట్టుకున్నారు. రాబిన్ శర్మ అనే వ్యూహకర్తని పెట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇక తన రాజకీయ చాతుర్యంతో ప్రత్యర్ధులని చిత్తు చేసే కేసీఆర్ సైతం ప్రశాంత్ కిషోర్ న నమ్ముకున్నారు. మొత్తానికి ప్రతి పార్టీకి ఒక వ్యూహకర్త ఉన్నారు.

అయితే ఇంతకాలం ప్రశాంత్ కిషోర్ మారుమ్రోగింది గాని..ఎప్పుడు రాబిన్ శర్మ పేరు తెరపైకి రాలేదు. ఏదో అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వచ్చాయి తప్ప…ప్రత్యేకంగా ఆయన పేరు బయటకు రాలేదు. కానీ తాజాగా వైసీపీ రాబిన్ శర్మ పేరుని తీసింది. ఏదైనా నెగిటివ్ అంశం వస్తే ఇది పీకే వ్యూహామని వెంటనే టీడీపీ నేతలు మీడియాలోనూ…సోషల్ మీడియాలోనో ప్రచారం చేస్తూ వస్తున్నారు.

అదే మాదిరిగా ఇప్పుడు వైసీపీ రాబిన్ శర్మ పేరు తీస్తుంది. తాజాగా ఓ సర్వే పేరుతో బెస్ట్ సీఎంల ర్యాంకింగ్స్ వచ్చాయి. అందులో సీఎం జగన్ ర్యాంక్ 20వ స్థానంలో ఉంది. దీంతో ఇది రాబిన్ శర్మ సృష్టి అని, టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్ కు చెందిన ఓ సంస్థ ఇలా బెస్ట్ సీఎంల సర్వే పేరుతో జగన్ ని అట్టడుగు స్థానంలో పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. ఇదంతా ఫేక్ అంటున్నారు.

అయితే పీకేకు ధీటుగా రాబిన్ సైతం వ్యూహాలు వేస్తున్నట్లు తెలుస్తోంది…మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం..అనేక రకాల ఎత్తులు వేస్తున్నారని సమాచారం. కాకపోతే ఆ మధ్య టీడీపీ వ్యూహకర్తగా రాబిన్ ని తప్పించినట్లు వార్తలు వచ్చాయి…సునీల్ కానుగోలు అనే వ్యూహకర్తని పెట్టుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఏమో రాబిన్ పేరు తీసుకొస్తుంది. అంటే రాబిన్…ఇంకా టీడీపీకి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి పీకే-రాబిన్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news