HIT 2 : హిట్‌ 2 మూవీ కిల్లర్‌ పై వివాదం..అడవి శేషుపై ఫ్యాన్స్ సీరియస్ !

-

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని భారీ హిట్ లు కొట్టే అడివి శేషు మ‌రోసారి సరి కొత్త క‌థ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ HIT 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. అయితే గ‌తం లో HIT అనే సినిమా తో యువ క‌థ‌నాయ‌కుడు విశ్వ‌క్ సేన్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. మంచి హిట్ అందుకున్నాడు.

దీంతో ఈ సినిమా కు సిక్వెల్ గా HIT 2 ను తీస్తున్నారు. కాగా ఈ సినిమా ను విశాఖప‌ట్నం నేప‌థ్యం లో తీశారు. విశ్వ‌క్ సేన్ హిట్ సినిమా కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన శైలేష్ కొల‌ను ఈ సినిమా కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

హిట్‌ 2 మూవీ కిల్లర్‌ ఎవరనేది ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు పరిచయం చేస్తామని అడవి శేష్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ అందరూ సాయంత్రం వరకు ఎదురుచూశారు. అయితే.. సరిగ్గా సాయంత్రం 6.03 గంటలకు కిల్లర్‌ ను పరిచయం చేయకుండా… థియేటర్ లో చూడాలని ఓ వీడియో పెట్టాడు. దీంతో మండిపోయిన ఫ్యాన్స్, నెటిజన్లు అడవి శేషుపై సీరియస్ అవుతున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 2న అంటే రేపు రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news