ఇంట్లో పూజించే శివలింగం ఎంత ఉండాలి?

-

శివ అంటే చాలు మంగళం. సర్వశుభంకరుడుగా పేరుగాంచిన శివున్ని అందరూ పూజిస్తారు. చాలామందికి తమతమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకుని అభిషేకం చేసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే కొన్ని నియమాలను పాటిస్తే అందరూ లింగార్చన చేసుకోవచ్చు. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే సర్వ శ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండవచ్చు అనేది మరో అనుమానం.. వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు.

Lingam - Wikipedia

కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివ లింగం తయారుచేసుకుని శివుని అర్చించవచ్చు. ఇక ఆలస్యమెందుకు ఆ భోళా శంకరుడిని భక్తితో శ్రద్ధతో అర్చించి సర్వశుభాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news