ఓ వైపు టీడీపీ-జనసేన పార్టీలూయీ పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి…మరోవైపు జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం…టీడీపీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంది. మరి ఆ లెక్కన చూస్తే ఏపీలో పొత్తు అంశం ఎటు తేలుతుందో క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో పొత్తుకు చంద్రబాబు ముందుకొచ్చారు…అటు పవన్ సైతం బాబుతో పొత్తుకు రెడీగానే ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చకూడదని చెప్పారు. అంటే టీడీపీతో కలవాలి అనేది పవన్ ఆలోచన అర్ధమవుతుంది.
అయితే టీడీపీ-జనసేన కలిస్తే బీజేపీ కూడా కలవాలి…ఎందుకంటే జనసేన-బీజేపీ ఇప్పుడు పొత్తులో ఉన్నాయి..కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు ఇష్టపడటం లేదు..అసలు చంద్రబాబు ఇప్పటికే తమని మోసం చేశారని, మరోసారి ఆయనతో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. పైగా ఇప్పటికీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
అధికారంలో ఉందేమో జగన్…ఆయనపై సోము విమర్శలు చేసేది తక్కువ…కానీ ఏదో మొక్కుబడిగా మాత్రం జగన్‌పై విమర్శలు చేస్తారు..చంద్రబాబుని మాత్రం గట్టిగానే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఓ వైపు ఏమో పవన్…టీడీపీతో కలవడానికి రెడీ అంటుంటే…మరో వైపు సోము ఏమో బాబుని తిట్టే పనిలో ఉన్నారు. మరి ఇలా జరుగుతుంటే పొత్తు ఎలా సెట్ అవుతుందో అర్ధం కాకుండా ఉంది. ఒకవేళ బీజేపీ పొత్తు ఒప్పుకోకపోతే పవన్, బీజేపీని వదిలేసి టీడీపీతో నడుస్తారా? లేక టీడీపీని పక్కన పెట్టి బీజేపీతోనే సర్దుకుంటారో తెలియదు.
అయితే టీడీపీ నుంచి మాత్రం జనసేన-బీజేపీలతో పొత్తు పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కాకపోతే టీడీపీ కార్యకర్తలు జనసేనతో ఓకే గాని, బీజేపీతో మాత్రం పొత్తు వద్దు అనే చెబుతున్నారు. ఇలా పొత్తు విషయంలో అనేక రకాలుగా కన్ఫ్యూజన్ ఉంది..మరి పొత్తుని పవన్ కల్యాణ్ మాత్రమే సెట్ చేయాలి..ఆయనే బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. చూడాలి మరి చివరికి బీజేపీ పొత్తులో ఉంటుందో లేదో?