వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒకటే ఉంటుంది: రఘునందన్ రావు

-

తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలం గవర్నర్ ప్రసంగం లేదని… ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపామని… గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారని.. మాకు రెండు నిమిషాలు అవకాశం ఇవ్వాలని కోరామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు బట్టి విక్రమార్క స్పీకర్ దగ్గర వచ్చి నిరసన తెలుపుతూ గందరగోళం కలిగించారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒకటే ఉంటుందని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీ తొలిరోజు నుంచి బట్టి విక్రమార్కను కేసీఆర్ పొగిడితే.. కేసీఆర్ ను బట్టి విక్రమార్క పొగిడారని ఆయన అన్నారు. నిన్న లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ టీఆర్ఎస్, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో.. రేవంత్ రెడ్డి లోక్ సభలో అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ రెండు కలిసిపోయాయని.. ఒక నాణెంకు బొమ్మ కాంగ్రెస్, బొరుసు టీఆర్ఎస్ అని విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి మెడికల్ స్టూడెంట్ తీసుకురావడంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి.. కేటీఆర్ ఉక్రెయిన్ కు వెళ్లి విద్యార్థులను తీసుకువచ్చారా..? అంటూ ఎద్దేవా చేశారు రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news