ఖర్జూరం ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో..!!

-

ఖర్జూరం వల్ల కలిగే లాభాల గురించి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలిm ముఖ్యంగా ఎండు ఖర్జూరంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని వాటిని పాలలో కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే ముందు రోజు రాత్రి నీళ్లలో ఎండు ఖర్జూరాలను నానబెట్టి, మరుసటి రోజు ఎండు ద్రాక్షను మెత్తటి పేస్టులా చేసి దానిని పాలలో కలుపుకొని తాగడం కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

ఎండు ద్రాక్ష , పాలు రెండిట్లో కూడా పోషక పదార్థాలు పుష్కలంగా లభించడమే కాకుండా హెల్తీ ఫ్యాట్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఎండు ద్రాక్షలో లభిస్తే .. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు వంటివి పాలల్లో లభిస్తాయి. అందుకే ఈ రెండిటిని కలిపి తాగడం వల్ల ప్రతిరోజు పోషక పదార్థాల లేమి నుంచి విముక్తి పొందవచ్చు. ఇక ఆరోగ్యం బాగుండడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పాలు, ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మెదడు పనితీరు మెరుగుపడి.. మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది అల్జీమర్స్ సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి ఔషధం అని చెప్పవచ్చు.

ఇక ఎముకలకు కూడా బలం చేకూరుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు ఎండు ద్రాక్షలో ఉండే బోరాన్ అనే కెమికల్ ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడుతుంది. విరిగిన ఎముకలను గాయాలను త్వరగా మాన్పించడానికి ఎండు ఖర్జూరం సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇక మెటబాలిజంను వృద్ధి చేస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచి, శరీరాన్ని ఎప్పటికప్పుడు డీ టాక్సీపై చేస్తుంది .కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news