కిడ్నీ సమస్యలు రాకూదంటే బీపీ ఎంత ఉండాలి..?

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీ సమస్యలు కూడా ఒకటి. కిడ్నీ సమస్యల వలన ఎంతగానో సఫర్ అవుతున్నారు. కిడ్నీ పనితీరు తగ్గడం.. ఫెయిల్ అవ్వడం ఇలా సమస్యలు కనుక వచ్చాయి అంటే బాగు చేయడం ఎంతో కష్టం. కిడ్నీ కనుక ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ ని డయాలసిస్ అంటారు. దీని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి.

పైగా ఇంత చేసిన తర్వాత అయినా ఆరోగ్యం బాగుంటుందా అంటే గుండె జబ్బులు, అవయవాలు దెబ్బ తినడం వంటివి జరుగుతాయి కిడ్నీ ఆరోగ్యం కూడా మారదు. అయితే కిడ్నీలు పాడైపోకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కిడ్నీల సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో వుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్ల లో 10 నుండి 30% వచ్చే రిస్క్ ఉంది.

అదే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి అయితే 40% కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు లేకుండా చూసుకోవాలి. లేదంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం అవసరమైతే డాక్టర్ ని కన్సల్ చేయడం చాలా ముఖ్యం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవడానికి బ్లడ్ సిరం క్రియాటిన్ ద్వారా కూడా మనం కిడ్నీల పనితీరు చూడొచ్చు. అలానే ఆల్బుమిన్ టెస్ట్ ద్వారా కిడ్నీ హెల్త్ తెలుసుకోవచ్చు. హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువగా లేకుండా షుగర్ వున్నవాళ్లు చూసుకోవాలి. బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news