మీ వయసెంత.. కింగ్‌ ఛార్లెస్‌-IIIకు చిన్నారి ప్రశ్న

-

బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-IIIకి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. మీ వయసెంత అంటూ ముద్దుముద్దుగా ఓ బుజ్జాయి కింగ్ ఛార్లెస్-IIIని ప్రశ్నించింది. దానికి రాజు ఇచ్చిన సమాధానంతో అక్కడంతా నవ్వులు పూశాయి. ఇంతకీ కింగ్ ఛార్లెస్ III సమాధానం ఏంటంటే..?

సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్‌ జీరో వాల్తమ్‌స్టోవ్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కింగ్‌ ఛార్లెస్‌III తూర్పు లండన్‌ వెళ్లారు. అక్కడ ఆయన్ను బార్న్‌ క్రాఫ్ట్‌ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. జెండాలు ఊపుతూ ఛార్లెస్‌ను ఉత్సాహపరిచారు. ఆ చిన్నారులతో కింగ్‌ ఛార్లెస్‌ III కాసేపు సరదాగా ముచ్చటించారు. సెలవు దినాలు, భోజన సమయం వంటి కుశల ప్రశ్నలు వేశారు.

చిన్నారులు కూడా కింగ్‌కు పలు చిలిపి ప్రశ్నలు సంధించారు. అందులో ఓ చిన్నారి ఛార్లెస్‌ని ‘మీ వయసు ఎంత’ అని అడిగారు. దీంతో అక్కడున్నవారి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దీనికి ఛార్లెస్‌ కూడా తనదైన శైలిలో ‘గెస్‌ చేయండి’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news