షాకింగ్ : దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

-

ఎప్పటికప్పుడు రేటు పెరుగుతూ జనాన్ని ఏడిపించే ఉల్లి ఈసారి మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో అయితే దారుణంగా రెట్లు పడిపోయాయి. క్వింటాల్ ఉల్లిపాయలు ధర కేవలం 800 కి పడిపోయింది. కర్నూల్, హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున మహారాష్ట్ర ఉల్లి  చేరుతోంది. దీంతో రెట్లు మరింత పడిపోతున్నాయని అంటున్నారు.

ఏపీ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో దాదాపు 5వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ యార్డ్‌కి 6వేల క్వింటాళ్ల ఉల్లి ఉత్పత్తులు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మధ్యస్తంగా క్వింటా ఉల్లి ధర 500 రూపాయలు పలుకుతోందని అంటున్నారు. కనీసం రెండు వేల రూపాయల ధర పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు రైతులు. మామూలుగా మహారాష్ట్ర, గుజరాత్‌ ఉత్పత్తుల దిగుబడిపై కర్నూల్ మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి వస్తుంది. దీంతో ధర పడిపోయిందని అంటున్నారు అధికారులు.   

Read more RELATED
Recommended to you

Latest news