పండుగ ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

-

భాగ్యనగరంలో అప్పుడే పండుగ వాతావరణ మొదలైంది.. ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులతో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులు టికెట్ల కోసం గంటల తరబడి కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు అదనంగా మరికొన్ని టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 కౌంటర్లు మాత్రమే ఉండగా.. అదనంగా మరో 9 కౌంటర్లను ఏర్పాటు చేసి మొత్తం 21 కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిబ్బందిని కూడా పెంచారు. రైల్వే స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలిపేందుకు అదనంగా మరికొంతమంది అధికారులను ఏర్పాటు చేశారు.

మరోవైపు ఇవాళ,రేపు (13, 14 ) తేదీల్లో పలు MMTS రైళ్లు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి–హైదరాబాద్‌–లింగంపల్లి మధ్య 5 సర్వీసులను, ఫలక్‌నుమా–లింగంపల్లి–ఫలక్‌నుమా మధ్య 11 సర్వీసులను, హైదరాబాద్‌ –ఫలక్‌నుమా –హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news