Viral Video: చైనాలో భారీ ఇసుక తుఫాను.. వీడియో చూస్తే షాక్ అవుతారు?

-

భారీ ఇసుక తుఫానుల గురించి మనం చాలా సార్లు సినిమాల్లో చూసి ఉంటాం. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఓ రకమైన ఎక్సైట్‌మెంట్, భయం వస్తుంటుంది. ఆ తుఫానును చూసి ప్రజలు భయాందోళనతో పరుగెడుతుంటారు. సమీప ప్రాంతాల్లోని సామగ్రిలు ఇసుకతో కప్పబడిపోతాయి. అలాంటి ఓ తుఫానే చైనాలో వచ్చింది. ఈ ఇసుక తుఫాను ఆకాశాన్నే కమ్మేసినట్లుగా వచ్చింది. వాయువ్య చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్ ప్రాంతంలో భారీ తుఫాను బీభత్సం సృష్టించింది.

చైనా-ఇసుక తుఫాను
చైనా-ఇసుక తుఫాను

దీంతో ఆ ప్రాంతంలో వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా చిక్కుకుపోయాయి. దాదాపు 4 గంటలపాటు ఈ ఇసుక తుఫాను కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. 200 మీటర్ల ఎత్తులో అత్యంత వేగంగా ఈ తుఫాను వచ్చిందన్నారు. భారీ ఎండలో కూడా సూర్యుడిని ఈ ఇసుక తుఫాను కమ్మేసిందన్నారు. ఈ తుఫాను కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news