విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్లు పట్టివేత

-

విజయవాడ లో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. కోట్ల విలువ చేసే 80 లక్షల ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండు బృందాలుగా విడిపోయి…..విజయవాడ- విశాఖపట్నం, విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పై మాటు వేశారు కస్టమ్స్ అధికారులు. తమిళనాడు, బీహార్ నెంబర్ లతో ఉన్న రెండు లారీలను నిలిపివేసిన కస్టమ్స్ అధికారులు..లారీలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు.

దీంతో విదేశీ సిగరెట్లు గుట్టు బయటపడింది. ఇద్దరు డ్రైవర్లు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు కస్టమ్స్ బృందం. పాట్నా, బీహార్ నుండి లోడ్ తెచ్చినట్లు, అందులో ఏమి ఉందో మాకు తెలియదు అంటూ కస్టమ్స్ అధికారులకు చెప్పారు డ్రైవర్లు. 80 లక్షల సిగరెట్లు సీజ్ చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. విజయవాడ లో ఉన్న డెలివరీ అడ్రస్ వివరాలు తెలుసుకుంటున్నారు కస్టమ్స్ బృందం.

Read more RELATED
Recommended to you

Latest news