కోటీశ్వరులకు కేరాఫ్ అడ్రస్ ముంబై… తర్వాతి స్థానాల్లో ఉన్న నగరాలు ఇవే

-

కోటీశ్వరుల కుటుంబాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఇండియా వాణిజ్య రాజధాని ముంబై. హూరన్ వెల్త్ రిపోర్ట్ 2021లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో మిలియనీర్ కుటుంబాలు ముంబైలో ఉన్నాయి, తర్వాత ఢిల్లీ మరియు కోల్‌కతా ఉన్నాయి. ముంబైలో 20,300 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో 17,400 కుటుంబాలు, కొల్ కతాలో 10,500 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన కుటుంబాలు దేశంలో 4,58,000 మంది ఉన్నారు. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య  30 శాతం పెరిగి, 6 లక్షలకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.

గత ఏడాది 18 శాతంతో పోలిస్తే 36 శాతం మంది భారతీయ మిలియనీర్లు ఇ-వాలెట్లు లేదా యూపీఐ ద్వారా చెల్లించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని హూరన్ నివేదిక వెల్లడించింది. స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టెట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మిలియనీర్లు మొగ్గు చూపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే 2020తో పోలిస్తే 2021లో హ్యాపీనెస్ ఇండెక్స్ పడిపోయింది. 2020లో హ్యాపీనెస్ ఇండెక్స్ 72 శాతం ఉంటే.. 2021లో 66 శాతానికి పడిపోయింది.

మిలియనీర్లు తమ పిల్లలను ఎక్కువగా విదేశాలకు పంపించి చదివించేందుకు మొగ్గుచూపిస్తున్నారని వెల్లడించింది. మిలియనీర్లలో 70 శాతం మంది తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు ఇష్టపడతారని నివేదిక పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ అత్యంత ప్రాధాన్యత (29 శాతం) ఇవ్వగా… UK (19 శాతం), న్యూజిలాండ్ (12 శాతం) మరియు జర్మనీ (11 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news