యాదాద్రి శ్రీ సుద‌ర్శ‌న నార‌సింహ మ‌హాయాగం వాయిదా

-

యాదాద్రిలోరాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆల‌యాన్ని పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మార్చి 28 నుంచి మూల‌వ‌ర్యుల ద‌ర్శ‌నం క‌లిగించాల‌ని భావించారు. అలాగే యాదాద్రి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని మార్చి 21 నుంచి నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే తాజా గా యాదాద్రి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు యాదాద్రి మండ‌లి తెలిపింది. క‌ట్ట‌డాలు పూర్తి కాక‌పోవ‌డంతోనే ఈ శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

yadadri-temple
yadadri-temple

మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్నినిర్వ‌హించాల‌ని భావించారు. కానీ తాజా గా వాయిదా ప‌డింది. అలాగే గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ప్రకారం మార్చి 28 నుంచే మూలవర్యుల దర్శనం ప్రారంభం అవుతుంది. అయితే ఆలయ ఉద్ఘాటన తరువాత మహాయాగం నిర్వహించే అవకాశం ఉంద‌ని తెలుస్తుంది. శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్నినిర్వ‌హించేందుకు త్వ‌ర‌లోనే మ‌రో ముహూర్తం ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మహాకుంభ సంప్రోక్షణ పర్వం తర్వాత యాదాద్రి ప్రధానాలయంలోకి భక్తులకు అనుమతి ఉండ‌నుంది. అలాగే ఈ నెల చివ‌రి వ‌ర‌కు ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news