భార్యాభర్తలు నెలకు రూ. 200 కడితే ఏటా రూ. 72 వేలు.. అదిరిపోయే స్కీమ్‌

-

డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని ఎక్కడ ఇన్వస్ట్‌ చేయాలో తెలుసుకోవడం కూడా తెలిసి ఉండాలి. మీ డబ్బు మీ దగ్గరే ఉంటే ఎన్ని రోజులు ఉన్నా అదే అలానే ఉంటుంది. కానీ తెలివైనవాళ్లు ఎప్పుడూ అలా ఉంచరు. దాన్ని ఎలా డబుల్‌ చేయాలో అన్వేషిస్తారు. అందుకోసం బోలెడన్నీ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ప్రీమియం ఎక్కువ పొందవచ్చు. పైగా బెనిఫిట్స్‌ కూడా ఎక్కువే. నెలకు కేవలం రూ.200 కడితే చాలు రూ. 72 వేలు సొంతం చేసుకోవచ్చు. రూ. 200తో రూ. 72 వేలు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. దీని ద్వారా అదిరే బెనిఫిట్ పొందొచ్చు. అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ తీసుకువచ్చింది. ఇది పెన్షన్ ప్లాన్. అంటే రిటైర్మెంట్ వయసు వచ్చిన దగ్గరి నుంచి ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు.

కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని అందుబాటులో ఉంచింది. 2019 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ. 200 కడితే చాలు ఏటా రూ. 72 వేలు పొందొచ్చు. కూలీ పనికి వెళ్లే వారు, అగ్రికల్చర్ వర్కర్లు, ఇటుకల బట్టిలో పని చేసే వారు, బీడి కార్మికులు, రిక్షా నడిపే వారు, చెప్పులు కుట్టే వారు ఇలా పలు రకాల పనులు చేసుకునే వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెల వారి ఆదాయం రూ. 15 వేలు కన్నా తక్కువ ఉంటే సరిపోతుంది.

ఎవరు అర్హులు..

18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
అలాగే నేషనల్ పెన్షన్ (ఎన్‌పీఎస్), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) స్కీమ్స్‌లో చేరని వారికి మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది.
పన్ను చెల్లింపు దారులకు ఈ స్కీమ్ వర్తించదు.

30 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 60 ఏళ్ల వరకు కట్టాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ చేరితే నెలకు రూ. 200 కట్టాల్సి వస్తుంది. వీరికి 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి నెలకు రూ. 3,000 చెల్లిస్తారు. ఇలా జీవించి ఉన్నంత వరకు ఈ డబ్బులు వస్తాయి.
అంటే ఏటా రూ. 36 వేలు వస్తాయి. ఇద్దరికీ అయితే రూ. 72 వేలు లభిస్తాయి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ ఉన్న వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news