డబ్బులు ఇవ్వు లేకుంటే.. నీ నగ్నఫోటోలో బయటపెడతా.. భార్యనే బెదిరించిన మొగుడు

-

రోజు రోజుకు ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. తాగుడికి బానిసై ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యనే తన నగ్నఫోటోలు బయటపెడుతానంటూ బెదిరింపులకు దిగాడో దుర్మార్గుడు. ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన ఓ మహిళ (26) ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నిఖిల్ (25) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో గతేడాది నవంబరులో పెద్దమ్మతల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మూడు నెలలపాటు ఎవరి ఇంట్లో వారు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కలిసి ఉంటున్నారు.

ఆ తర్వాతి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పనిపాట లేకుండా ఖాళీగా ఉంటున్న నిఖిల్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు కొనసాగించాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. అతడి వేధింపులు శ్రుతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు నిన్న ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version