ప్రకాశం : బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నిక నేపథ్యం లో ఇవాళ జనసేన పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు కు నమ్మకం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ తో జన సేన కలిసే ఉందని… బద్వేలు ఉఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థి ని నిలబెట్టడం లేదని తెలిపారు.
ఏపీ లో జనసేన బీజేపీ తో పొత్తు ఉన్నందున… బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారం చేయడం పై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. మరోసారి చర్చలు జరిపిన అనంతరం ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. కాగా.. బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నిక.. అక్టోబర్ 30 వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, కాంగ్రెస్ మరియు బీజేపీలు మాత్రమే బరిలో ఉన్నాయి.