రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు ఈటల ఎపిసోడ్ పెద్ద సంచలనం అయితే.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం, హుజూరాబాద్‌లో ఎన్నికల హడావిడీ ఒక ఎత్తయితే.. ఇప్పడు రేవంత్ కు పీసీసీ ఇవ్వడం, మిగతా వారంతా వ్యతిరేకిస్తూ కొందరు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఇక రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వస్తున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ ఎస్, బీజేపీలకు ఎంత ముఖ్యమో, కాంగ్రెస్‌కు కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ ఈ ఎన్నికల్లో ఎంతగా సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రేవంత్ హయాంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అంచనాలు పీక్ స్టేజ్‌లోకి వెళ్లాయి. ఇక్కడ అభ్యర్థిగా ఒక పేరు వినిపిస్తున్న కౌశిక్‌రెడ్డి గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉండటం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశం. మరి దీన్ని రేవంత్ అవకాశంగా మలుచుకుంటారా లేక ఇతర అభ్యర్థికి ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా రేవంత్‌కు ఇది పెద్ద పరీక్షే అని చెప్పాలి. ఈ ఫలితమే ఆయన ప్రభావాన్ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోతే ఆయనకు సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది.