హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు..!

-

ఇండియా రిపబ్లిక్ రోజు అయిన జనవరి 26 వ తేదీన ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదికను సీక్రెట్ గా అందజేసింది ఇంటలిజెన్స్. భారత 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు.

BJP
BJP

అయితే ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే… హైదరాబాద్ లోని బిజెపి పార్టీ కార్యాలయానికి కూడా… ఉగ్ర వాద ముప్పు ఉన్నదని ఇంటెలిజెన్స్ పేర్కొంది. బీజేపీ పార్టీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉండాయి హెచ్చరించిన ఇంటిలిజెన్స్.. పార్టీ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారని కూడా స్పష్టం చేసింది. పార్టీ కార్యాలయానికి సంబంధం లేని వచ్చే వారి పై మానిటరింగ్ లేదని సీరియస్ అయింది… పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు… అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించింది ఇంటిలిజెన్స్.. బిజేపి పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని టార్గెట్ లో ఉన్న బీజేపీ ముఖ్య నేతకు తెలిపాయి నిఘా వర్గాలు. దీంతో తెలంగాణ బిజేపి నేతలు అలర్ట్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news