హైద‌రాబాద్ లో దారుణం..భ‌ర్త స్వ‌గ్రామానికి ర‌మ్మన్నాడ‌ని భార్య ఆత్మ‌హ‌త్య‌..!

హైద‌రాబాద్ లో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌టంతో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కూక‌ట్ ప‌ల్లి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…సిద్ధిపేట‌కు చెందిన రాజ‌మ‌ణి, బ్ర‌హ్మానందంల కుటుంబం కూక‌ట్ప‌ల్లిలో నివాసం ఉంటోంది. కాగా వీరి కూతురు ప్రియంక‌కు హ‌న్మ‌కొండ‌కు చెందిన అన్వేష్ అనే యువ‌కుడితో గ‌తేడాది న‌వంబ‌ర్ లో వివాహం జ‌రింగింది. అయితే గ‌తేడాదిన్న‌ర కాలంగా ఇద్ద‌రూ వ‌ర్క్ ఫ్రం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న విష‌యాల‌కే గొడ‌వ‌లు పెర‌గ‌టం మొద‌ల‌య్యింది. కాగా అన్వేష్ త‌న‌తో పాటు త‌న భార్య ప్రియాంక ను హ‌న్మ‌కొండ రావాల‌ని గ‌త రాత్రి అడిగాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి గొడ‌వ జ‌రిగింది. ప్రియాంక తాను రాలేన‌ని చెప్పి వేరే గ‌దిలోకి వెళ్లి ప‌డుకుంది. కాగా ఉద‌యం లేచి చూసే స‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకుని క‌నిపించింది. దాంతో వెంట‌నే పోలీసులకు, ప్రియాంక త‌ల్లి దండ్రుల‌కు ఫోన్ చేసి జ‌రిగిన విష‌యాన్ని చెప్పాడు. ప్రియాంక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.