బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో మరో మైలు రాయి..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి 8రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర తొమ్మిదవ రోజు వికారాబాద్ లో మొదలు కానుంది. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు వేయట్లేదని, తెలంగాణ వచ్చి ఎన్ని రోజులవుతున్నా నిరుద్యోగులు అలాగే ఉండిపోతున్నారని విమర్శలు చేసారు.

ఈరోజు మొత్తం 13కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మదన్ పల్లి నుండి మామినిపేట్ వరకు పాదయాత్ర జరగనుంది. తొమ్మిదవ రోజు చేస్తున్న పాదయాత్రతో వందకిలోమీటర్లు పూర్తి కానుంది. అందువల్ల వందమంది నిరుద్యోగులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొననున్నారు.