తీన్మార్ మల్లన్నకు తీవ్ర అస్వస్థత !

ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. అరెస్ట్ చంచల్ గూడా జైల్ లో ఉన్న… తీన్మార్ మల్లన్న తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం అందుతోంది. ఆయన నిన్న రాత్రి నుంచి… తీవ్ర అస్వస్థతకు గురైన తీన్మార్ మల్లన్న ను ఆస్పత్రికి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్ పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. తీన్మార్ మల్లన్న భార్య మతమ్మ అ పిటిషన్ను దాఖలు చేశారు. మల్లన్న ను అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన 306 మరియు 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నందున స్టే ఇవ్వలేమని తేల్చేసింది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు సెప్టెంబర్ 14 కు వాయిదా పడింది.