Breaking : హైద‌రాబాద్ అభివృద్ధిపై రీల్స్ కాంటెస్ట్..

-

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో, ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో.. హైద‌రాబాద్ నగర రూపురేఖలు ఎలా మారాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓ వైపు అభివృద్ధి ప‌రుగులు పెట్ట‌డం, మ‌రో వైపు పెట్టుబ‌డులు త‌ర‌లిరావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రం జెట్ ప్లేన్ లాగా ముందుకెళ్తుంది. అంతే కాదు.. న‌గ‌రాన్ని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అటు ప్రజా ర‌వాణాకు, ఇటు ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌త్యేక ప్రాముఖ్యత చూపుతున్నారు.

Hyderabad: Great with Reels? Love Hyderabad? Here's something exciting for  you! | INDToday

ఇందులో భాగంగా న‌గ‌రాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, లింకు రోడ్లు వచ్చాయి. మ‌రో వైపు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తూ, న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా పెడ్తుహున్నారు. ఈ నేపధ్యం లో హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త తొమ్మిదేండ్ల‌లో జ‌రిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిట‌ల్ మీడియా వింగ్ రీల్స్ కాంటెస్ట్ పోటీల‌ను జరపనుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొద‌టి బ‌హుమ‌తిగా రూ. ల‌క్ష న‌గ‌దు ఇవ్వ‌నున్న‌ట్లు తెలంగాణ డిజిట‌ల్ మీడియా వింగ్ తెలిపింది. హైద‌రాబాద్ అభివృద్ధిపై యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం ఇచ్చింది.
ఈ నాలుగు వేదికల్లో.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా.. 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌ను @DigitalMediaTS కు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. తమ వీడియోలను [email protected] కు మెయిల్ కూడా చేయొచ్చు. వీడియోస్‌ను పోస్టు చేసేందుకు ఏప్రిల్ 30 చివ‌రి తేదీ. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇత‌ర వివరాల‌ కోసం.. https://it.telangana.gov.in/contest/ ను సంప్రదించొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news