హింసాత్మక ఘటనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణం : అసదుద్దీన్‌

-

పశ్చమబెంగాల్, బీహార్ లో శ్రీ రామనవమి రోజు జరిగిన హింసాత్మక ఘటనలు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. బెంగాల్, బీహార్ ప్రభుత్వాలపై ప్రతిపక్ష పార్టీ లు తమ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. నేడు ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా నితీష్ కుమార్, మమతా బెనర్జీ ప్రభుత్వాలపై మండిపడ్డారు. బిహార్, బెంగాల్లో జరిగిన కాల్పులను అరికట్టడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో హింస జరిగితే… దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.

Asaduddin Owaisi terms UP results as victory of '80-20'

బీహార్లో సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లు ముస్లింలలో భయాన్ని పెంచుతున్నారని అన్నారు ఆయన. నలంద సున్నితమైన జిల్లా అని బీహార్ సిఎం నితీష్ కుమార్‌కు కూడా ఈ విషయం తెలుసని…అక్కడ జరిగిన సంఘటపై ఆయనకు అసలు పశ్చాత్తాపం లేదన్నారు. బీహార్‌ షరీఫ్‌లోని మదర్సా అజీజియాను తగులబెట్టారని..ముస్లింల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. ఇది పక్కా ప్రణాళికతోనే జరిగిందని అన్నారు ఓవైసీ. బిహార్లో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. బీహార్ కు ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ హింసాత్మకఘటనలను ఎందుకు ఆపలేకపోయారన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయినా… బీహార్ ప్రభుత్వం అయినా..హింసాత్మక ఘటనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. కర్ణాటకలో ఇద్రీస్ పాషాపై మూక హత్యలు జరిగినా, ప్రభుత్వం ఏమి చేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాకాండపై సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత బెనర్జీ నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news