దేశంలో హైదరాబాద్ అత్యంత వేగంగా డెవలప్ అవుతోంది. దేశంలోని కోలకతా, చెన్నై మహానగరాాలను వెనక్కి నెట్టేస్తూ… దూసుకుపోతోంది. దీంతో జనాభా కూడా అందుకు తగ్గట్లుగానే పెరుగుతోంది. దాదాపుగా కోటిన్నర జనాభా జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో పెరుగుతున్న జనాభాతో హైదరాబాద్ నగరంపై ఒత్తడి కూడా పెరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తుందా… అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి అనుబంధంగా మరో నగరాన్ని నిర్మించాలనే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ 1.54 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 111 జీవో వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాల్లో 1.32 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీంట్లో 70 శాతం భూములు ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 111 జీవోను ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో భూములు పరిధిలో రోడ్లు, చుట్టూ పచ్చని వనాలతో మరో నగరాన్ని అభివ్రుద్ధి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.