కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం

-

విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన నలుగురు రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు.

ఓ కారులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు విహార యాత్రకు కర్ణాటక వెళ్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద మరో వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్‌గా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news