హైదరాబాద్‌లో వర్షం.. బయటికి రావొద్దని సూచనలు!

-

హైదరాబాద్‌లో వర్షం పడుతోంది. బయటికి రావొద్దని సూచనలు చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరి, వాహనదారులకు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదురు అయ్యాయి. నిన్న రాత్రి 11 గంటల వరకు వర్షం పడింది.

RAIN
RAIN

ఇవాళ కూడా హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. దింతో నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించిన జీహెచ్ఎంసీ… ఈ మేరకు అధికారులను అలెర్ట్ చేశారు. అటు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేరుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని… కరీంనగర్, జగిత్యాల సిరిసిల్ల, కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, అటు వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news